HomeతెలంగాణMinampally:మైనంపల్లి ఏకాకి

Minampally:మైనంపల్లి ఏకాకి

– సందిగ్ధంలో రాజకీయ భవితవ్యం
– కొంపముంచిన నోటిదురుసు
– కోపంగానే బీఆర్ఎస్​ అధిష్ఠానం
– మల్కాజిగిరి టికెట్​ డౌటే?
– ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న గులాబీ బాస్​
– ఇతరపార్టీల నుంచీ నో ఇన్విటేషన్స్​
– కేటీఆర్ కోసం వెయిట్​ చేస్తున్న మైనంపల్లి
– కొడుకుకోసం నోరు జారితే మొదటికే మోసం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఏకాకిగా మారిపోయారు. నోటి దురుసుతనమే ఆయన కొంప ముంచింది. మైనంపల్లి తీరుపట్ల గులాబీ బాస్​ కేసీఆర్​ ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఆయనను పక్కకుపెట్టి శంభీపూర్​ రాజు లేదంటే మర్రి రాజశేఖర్​ రెడ్డిని బరిలో దించేందుకు ఉన్న అవకాశాలను కూడా కేసీఆర్​ పరిశీలిస్తున్నారు. దీంతో మైనంపల్లికి చిక్కులు తప్పేలా లేవు. ఆయన రాజకీయభవిష్యత్​ సందిగ్ధంలో పడిపోయింది. కేవలం కుమారుడి టికెట్​ కోసం మైనంపల్లి బీఆర్ఎస్​ పై నోరు పారేసుకున్నారు. మంత్రి హరీశ్​ రావును టార్గెట్​ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అయినప్పటికీ గులాబీ బాస్​ కేసీఆర్​ మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లికి అవకాశం ఇచ్చారు. మైనంపల్లి మాత్రం శాంతించలేదు. తాను ఇండిపెండెంట్​ గా బరిలో దిగుతానంటూ ప్రకటించారు. ఈ కామెంట్స్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ సీరియస్​ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

దారులన్నీ క్లోజ్​..
మైనంపల్లి బీఆర్ఎస్​ నుంచి ఒకవేళ బయటకు వస్తు ఒంటరిగా మారక తప్పదు. ఇతర పార్టీల నుంచి కూడా ఆయనకు పెద్దగా ఆహ్వానాలు లేవు. గతంలో పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్​ మీద కూడా మైనంపల్లి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలను కొట్టించిన చరిత్ర కూడా ఉన్నది. దీంతో మైనంపల్లిని తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ, కాంగ్రెస్​ పార్టీ కూడా సిద్ధంగా లేవు. కుమారుడి టికెట్​ కోసం మైనంపల్లి నోరుజారారు. మరోవైపు ఆయన బీఆర్ఎస్​ పార్టీ నుంచి బయటకు వెళ్తే.. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు లేవు. అధికార వర్గం సహకరించదు. ఆయన శతృవులంతా ఏకమయ్యే అవకాశం ఉంది. వెరసి మైనంపల్లికి చిక్కులు తప్పవు.

కేటీఆర్ పైనే ఆశ..
ఇక మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం మంత్రి కేటీఆర్​ మీదే ఆశలు పెట్టుకున్నారు. కేటీఆర్​ విదేశాల నుంచి వచ్చిన తర్వాత తనకు ఏదైనా భరోసా దక్కుతుందని భావిస్తున్నారు. మరి కేటీఆర్​ విదేశాల నుంచి వస్తే .. మైనంపల్లిని క్షమిస్తారా? అన్నది వేచి చూడాలి. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న మైనంపల్లి.. కేటీఆర్​ ద్వారానే బీఆర్ఎస్​ పార్టీలోకి వచ్చారు. తన కుమారుడికి సైతం ఈ దఫా మెదక్​ అసెంబ్లీ టికెట్​ తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. బీఆర్ఎస్​ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పక్క రాష్ట్రంలో తిరుమల పుణ్యక్షేత్రంలో సొంత పార్టీ మీదే విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం మైనంపల్లికి చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బీఆర్ఎస్​ పక్కకు పెట్టడం.. మరోవైపు ఇతర పార్టీలు కూడా పట్టించుకోకపోవడంతో మైనంపల్లి ఒంటిరిగా మారిపోయారు. ఆయన దూకుడుగా ఉంటున్నానని భావించి నోటికి పనిచెప్పారు. ఈ వ్యవహారమే ఇప్పుడు కొంపముంచింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img