HomeతెలంగాణMinister Gangula:తెలంగాణను దోచుకునేందుకు పాదయాత్రలు:మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula:తెలంగాణను దోచుకునేందుకు పాదయాత్రలు:మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula:

ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఉమ్మడి జిల్లా అంటే ఎనలేని ప్రేమ అని, ఉమ్మడి జిల్లాను బలోపేతం చేసేందుకే భానుప్రసాదరావుకు చీఫ్ విప్, కౌశిక్ రెడ్డి కి విప్ పదవులు ఇచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసన మండలి చీఫ్ విప్ గా ఎన్నికైన తానిపర్తి భానుప్రసాద్ రావు మొదటి సారి పెద్దపల్లి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద ఘన పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత,ఎమ్మేల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…2009 లో తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నీళ్ళ కోసం ఎండిన వరి పంటతో అసెంబ్లీలో ఆందోళన చేపట్టామని .ఈ రోజు స్వయంపాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో 24 గంటల కరెంటుతో భూమికి బరువయ్యే పంట పండుతోందని అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని..నీళ్ళు ఉంటే కరెంట్ ఉండదు..పండిన పంట కొనే పరిస్థితి లేదనీ విమర్శించారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా..ఆంధ్రోళ్ల కళ్ళు మళ్ళీ తెలంగాణ పై పడ్డాయని అన్నారు. మళ్ళీ తెలంగాణను దోచుకునేందుకు పాదయాత్ర ల పేరిట మళ్ళీ మాయమాటలు చెప్పుకుంటూ ఉర్లల్లోకి వస్తున్నారని..వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చ రించారు.

మాయమాటలు నమ్మి మోసపోతే తమ పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందనీ..ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. రాష్ట్ర భవిష్యత్ రానున్న ఎన్నికలతో ముడిపడి ఉందని, మోసపోతే గొసపడతామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనీ 13 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి మా సత్తా చాటుతామని అన్నారు. నిరంతరం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పరితపించే కేసిఆర్ కు మీరంతా అండగా ఉండాలని, పొరపాటు జరిగితే తెలంగాణ యాబై ఏళ్లు వెనక్కి వెళ్తుందని అభిప్రాయ పడ్డారు.

Recent

- Advertisment -spot_img