HomeతెలంగాణHarish Rao : పరీక్షల కోసం రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదు

Harish Rao : పరీక్షల కోసం రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదు

Harish Rao : పరీక్షల కోసం రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదు

Harish Rao : ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ సేవలను పెంచాలని వైద్యారోగ్య అధికారులు, వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఆరోగ్య తెలంగాణగా పేరు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం నూతన పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోన్న విషయం తెలిసిందే.

13 సంస్థలు..రూ.2,84,980 కోట్లు.. బ్యాంకులకు ఎగవేతలు

ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రుల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పరికరాలను ప్రారంభిస్తున్నారు.

దీనిలో భాగంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి ఉస్మానియా ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్‌, సీటీ స్కాన్ సేవలను మంత్రి ప్రారంభించారు.

ఉస్మానియా ఆస్పత్రి వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

”ప్రస్తుతం రెండు సీటీ స్కాన్‌ యూనిట్‌లు అందుబాటులో ఉన్నాయి.

మీ వ్యాఖ్యలతో గౌరవం పోయింది.. రిటైర్డ్ జస్టిస్ చంద్రుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలో మరో 4 క్యాథ్‌ ల్యాబ్‌లు, ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకలు ఐసీయూ, కొత్త వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకొస్తాం.

ఉస్మానియా ఆస్పత్రిలో త్వరలోనే కొత్త మార్చురీ అందుబాటులోకి తీసుకువస్తాం.

పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవసరం రాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సకల వైద్య సేవలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

24 గంటల్లోగా రోగులకు పరీక్షలు జరిపి వైద్యులకు రిపోర్టులు వెళ్లాలి.

50 ఏండ్లు పోరాడి 2.6 వేల కోట్లు సాదించారు

పరీక్షల కోసం రోజులు తరబడి రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదు.

జనవరి 1న మళ్లీ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిస్తాను.

ఉస్మానియాకు ఎన్‌ఏబీసీ అక్రిడేషన్‌ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

కోర్టు తీర్పు తర్వాత ఉస్మానియా భవనంపై నిర్ణయం తీసుకుంటాం” అని మంత్రి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img