Homeజిల్లా వార్తలుఈనెల 6న మద్నూర్ కి మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈనెల 6న మద్నూర్ కి మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మద్నూర్ మండలానికి మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఈ పాఠశాల ప్రాజెక్టు నిర్మాణం రూ.305 కోట్లతో నిర్మాణం పనులు జరుగుతాయని అన్నారు. ఈ నెల 6న రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి, కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా శంకుస్థాపన మరియు మద్నూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని.మొట్టమొదట కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు ఈ మారుమూల ప్రాంత జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈనెల 6న జరిగే శంకుస్థాపనకు జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు.

Recent

- Advertisment -spot_img