Minister Jupally : తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. మంత్రి జూపల్లి మాట్లాడతూ.. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ జూపల్లి కృష్ణారావు నోరు జారారు. అంతలోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని జూపల్లి సవరించుకున్నారు. అయితే గతంలో కూడా రేవంత్ రెడ్డి పేరు జగ్గారెడ్డి మర్చిపోయారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక సీఎంగా రేవంత్ రెడ్డికి తగ్గిన గౌరవం దక్కడం లేదు. ఈ క్రమంలోనే ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నా మాటలను గుర్తుపెట్టుకోండి.. మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఈ తప్పుకు త్వరలోనే మంత్రివర్గం నుంచి తొలగించినా ఆశ్చర్యం లేదని కేటీఆర్ ట్విట్ చేసారు.