– గొంతు నొప్పితో యశోద ఆస్పత్రిలో అడ్మిట్
ఇదే నిజం, హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారు. గొంతు నొప్పి ఎక్కువ కావడంతో మంగళవారం ఢిల్లీ నుంచి తిరిగి రాగానే సోమాజిగూడలోని యశోద హాస్పటల్లో చేరారు. మంత్రికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రెండు రోజులు దవాఖానలోనే ఉండాలని సూచించారు. దీంతో ఆయన యశోద హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఆయన తాజాగా భువనగిరి ఎంపీ పదవికి వెంకట్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.