ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ ను కట్టడి చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేస్తూ యువతను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తుందని అన్నారు.