Minister Lokesh’s key comments on jobs in Andhra Pradesh
ఏపీలో ఉద్యోగాల కల్పన గురించి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నారు. వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యాగాలు సాధించేందుకు నైపుణ్యాలకు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.