Homeహైదరాబాద్కోవిడ్ 19 ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కోవిడ్ 19 ఐసోలేషన్ సెంటర్ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

మేడిపల్లి, ఇదేనిజం: కరోనా వచ్చిందంటే పేద ప్రజలకు ఆర్ధికంగా ఎంతో భారంగా ఉంటుంది కాబట్టి వైధ్యం భారం కాకుండా ఉండాలనే లక్ష్యంతోనే పీర్జాదిగూడ కార్పోరేషన్​లో కోవిడ్​ – 19 భాదితులకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభిసన్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ అద్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పాత బిల్డింగ్​లో ఏర్పాటు చేసిన 30 పడకల కోవిడ్​ – 19 ఐసోలేషన్ సెంటర్‌ను మ్చేడల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి స్థానిక మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్​తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఒక కార్పోరేషన్ పరిధిలో కోవిడ్​ చికిత్సని అందిచేందుకు ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఫీర్జాదిగూడ ప్రజలు అదృష్టవంతులని అన్నారు.

కార్పోరేట్ హాస్పిటల్స్​కు దీటుగా ఇక్కడ 24 గంటల పాటు కరోనా పాజిటీవ్ వచ్చిన వారికి చికిత్స అందించేలా ఏర్పాటు చేశారని అన్నారు. పౌష్టిక ఆహరం, అక్సిజన్ లాంటివి కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ పరిస్థితి మరి విషమం ఉంటే తనకు చెందిన మల్లారెడ్డి హస్పిటల్ లో చికిత్సా కోసం పంపించాలని వైద్యులకు సూచించారు. తన వంతుగా ఐసోలేషన్ సెంటర్‌కు ఈ నెల చివరి వారం వరకు రెండు అంబులెన్సులు, కరోనా పరీక్షల చేయాడానికి మొబైల్ బస్సును అందించి మేడిపల్లి మండల పరిధిలోని ప్రజలకు అవసరమైన వారికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్​, నగర కమీషనర్ ఎం.శ్రీనివాస్, స్థానిక మేడిపల్లి సీఐ బీ.అంజిరెడ్డి, పీర్జాదిగూడ కార్పోరేషన్​కు చెందిన వివిధ డివిజన్​ల కార్పోరేటర్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img