ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు విజయవాడలోని రైతుబజార్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురునానక్ కాలనీ మరియు పంట కలువ రోడ్డులో ఉన్న రైతు బజార్లలో ప్రజలకు విక్రయించే వస్తువుల నాణ్యత మరియు ధరలపై స్వీయ పరిశీలన నిర్వహించారు. నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వంటనూనె, ఉల్లి, టమాట విక్రయాలపై వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.పామాయిల్‌ను రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను రూ.124కు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చారు.ఈ మేరకు రైతుబజార్లలోని దుకాణాల వద్ద ధరలను సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు.