ఇదే నిజం, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాప్ నుండి కరీంనగర్ వెళ్ళే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజి స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా టికెట్ తీసుకొని బస్సుల్లో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు..అనంతరం జూనియర్ కాలేజి లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్న..బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్త్వానికో,ప్రాంతీయ తత్వానీకో ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛ గా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ,పూర్తిగా స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ సూచించారు .ప్రజాస్వామ్యం నిలవాలంటే అఖండ భారతదేశం లోపల ఓటు అనే ఆయుధం ద్వారా అనేక అంశాలు మారుతుంటాయి..ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులు ఉన్న ,ఎన్ని బాధ్యతలు ఉన్న,విధిగా తమ ఇటు హక్కును వినియోగించుకోవాలెని ఇది మన బాధ్యత అని తెలియజేరు