Homeఫ్లాష్ ఫ్లాష్Minister prashanth reddy:నడ్డా నోరు అదుపులో పెట్టుకో బిడ్డా-నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్...

Minister prashanth reddy:నడ్డా నోరు అదుపులో పెట్టుకో బిడ్డా-నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

Minister prashanth reddy:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ లో కేసిఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా… ఇది కేసిఆర్ అడ్డా..ఆయన గురించి మాట్లాడే టప్పుడు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు బిడ్డా అని ఘాటుగా హెచ్చరించారు. .కుక్క తోక వంకర అన్నట్లు పదే పదె అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్..అది నోరా..డ్రైనేజీ మోరా అని ధ్వజమెత్తారు. వచ్చిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్ది మీద విషం చిమ్మే మాటలే చెప్తున్నవ్ సిగ్గుండాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కోసం కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం కాగితాల మీద 1లక్ష 21వేల కోట్లు మంజూరు చేసి 9ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 19 వేల కోట్లు మాత్రమే అని మంత్రి పేర్కన్నారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుండి టోల్ టాక్స్, సెస్ ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలేనని,కేంద్రం తన జేబులోంచి ఇచ్చింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగితాల మీద మంజూరి లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.కేసిఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండీషన్లు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించడం సిగ్గు చేటన్నారు.

రైతుల పాలిట వరంగా మారిన ధరణి ని రద్దు చేసి..మళ్ళీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనేది బీజేపీ ఆలోచనా అని మంత్రి మండిపడ్డారు. ధరణి పోర్టల్ లో రైతు భూమి వివరాలు ఆన్లైన్ రికార్డు కాబట్టే రైతు బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా రైతు ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. పేదలు,రైతులు రెండు కండ్లుగా పని చేస్తున్న కేసిఆర్ ని జైల్లో పెడతారా..ఆ దమ్ముందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచభూతాలను అమ్మకానికి పెట్టి,దేశ సంపద తన కార్పోరేట్ మిత్రులకు దోచి పెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img