HomeతెలంగాణRice in yasangi : యాసంగికి వ‌రి వేస్తే మాకు సంబంధం లేదు.. మేమైతే కొనం..

Rice in yasangi : యాసంగికి వ‌రి వేస్తే మాకు సంబంధం లేదు.. మేమైతే కొనం..

Minister Singireddy niranjan reddy said do not farm rice in yasangi : యాసంగికి వ‌రి వేస్తే మాకు సంబంధం లేదు.. మేమైతే కొనం..

ప్రభుత్వం వడ్లు(Rice in yasangi) కొనే పరిస్థితుల్లో లేదని తేల్చి చెప్పారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

శనివారం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ధాన్యం కొనుగోల్లపై వివరించారు.

యసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో రైతులు యసంగి సీజన్ లో వరి వేయొద్దన్నారు. 

యాసంగి వరికీ బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించామని.. సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న వాళ్ళు వరి పంట వేసుకుంటే ప్రభుత్వనికి సంబంధం లేదన్నారు.

 ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగంలో నిర్దిష్టమైన ప్రగతి సాధించిందన్న ఆయన.. తెలంగాణ వచ్చే నాటికి 22 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉంటే ఇవాళ అవి ముప్పై లక్షలకు చేరాయన్నారు.  

వానాకాలంలో అన్ని రకాల పంటలు ఒక కోటి యాబై లక్షలకు పైగా ఉంటే… వరి 62లక్షల ఎకరాల్లో సాగైందని చెప్పారు.

వానాకాలం సమయంలో పండే వరి పంట కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వనికి ఎలాంటి ఇబ్బందులు లేవని..

FCI బాయిల్డ్ రైస్ కొనమని స్పష్టం చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం యసంగి పంటను కొనలేమని తెలిపిందన్నారు.

Recent

- Advertisment -spot_img