Homeహైదరాబాద్మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి మంత్రి సింగిరెడ్డి నివాళి

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డికి మంత్రి సింగిరెడ్డి నివాళి

హైదరాబాద్ : రెండుసార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచి నిరాడంబర జీవితం గడిపి ఆదర్శంగా నిలిచిన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తీవ్ర సంతాపం ప్రకటించారు.

రైతు పక్షపాతి, ప్రజల పక్షపాతి అయిన కిష్టారెడ్డి సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిగా నిలిచారని మంత్రి గుర్తుచేసుకున్నారు.

వారి మరణం కల్వకుర్తి ప్రజలకు తీరని లోటని, సమైక్య రాష్ట్రంలో రైతాంగం పక్షాన వారి పోరాటాలు ప్రజల మనసుల నుండి చెరిగిపోవని అన్నారు. వారి అనుభవం ఈ ప్రాంత అభివృద్దికి ఉపయోగపడే సమయంలో వారు మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కిష్టారెడ్డి కుమారుడు, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంకు ఫోన్ చేసి పరామర్శించారు. కిష్టారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img