తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధమైన పాలసీ అమలు చేయాలో కులగణన కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం రాష్ట్రాన్ని ఎక్స్ రే తీయాలని.. అందులో భాగంగానే కులగణన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శనీయంగా కులగణన సర్వే కార్యక్రమం ఉంటుందని అన్నారు.