Homeతెలంగాణకూర్చొని మాట్లాడుకుంటాం.. అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తాం

కూర్చొని మాట్లాడుకుంటాం.. అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తాం

The appointment of Bigg Boss Fame Dettadi Harika as Telangana Tourism Brand Ambassador is known to be controversial.

State Tourism Minister Srinivas Goud was outraged that Harika was appointed without the knowledge of himself and the CM’s office.

It warned that action would be taken against those responsible.

Srinivas Goud has recently responded to this issue once again.

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసడర్ గా బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను నియమించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

తనకు, సీఎం కార్యాలయానికి తెలియకుండానే హారికను నియమించారంటూ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా మరోసారి ఈ అంశంపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

శ్రీనివాస్ గుప్తా తొలిసారి ఛైర్మన్ పదవిని చేపట్టారని… దీంతో నిబంధనలను అనుసరించకుండా హారికను నియమించారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఆమెను ఎలా నియమించారో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయంపై కూర్చొని మాట్లాడుకుంటామని… అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తామని తెలిపారు.

శ్రీనివాస్ గుప్తాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. టూరిజంశాఖ ఛైర్మన్ గా శ్రీనివాస్ గుప్తా ఉన్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img