ఇదేనిజం, శేరిలింగంపల్లి: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. ఆయన తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రిలో స్వర్గస్తులయ్యారు. కాగా ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్యం తో పాటు అనారోగ్య సమస్యలతో బాధడుతున్నారు. పార్థివ దేహాన్ని కొద్దిసేపట్లో కొండాపూర్ లోని మంత్రి నివాసంసైబర్ మీడోస్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. విషాద విషయాన్ని తెలుసుకున్న సీ ఏం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.పారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.