ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ రోజు పోలింగ్. ఫరూకాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ వ్యక్తి రిగ్గింగ్ చేశాడు. ఏకంగా 8 సార్లు బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్‌పుత్‌కు ఓటు వేశాడు. మొబైల్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకువెళ్లి రికార్డు చేశాడు. ఒకటోసారి, రెండోసారి…ఇలా అంటూ మొత్తం ఎనిమిది సార్లు బీజేపీకి ఓటు వేసి వీడియో రికార్డు చేశాడు. అయితే అక్కడి సిబ్బందిని తను ఎలా మ్యానేజ్ చేశాడనేది ఇంకా కొలిక్కి రాలేదు. సిరా గుర్తును తుడిపేసుకొని మళ్లీ లైన్‌లో నిలుచొని ఓటు వేశాడని అధికారులు భావిస్తున్నారు. ఓ ఫ్రేమ్‌లో వేరే చొక్కాతో కనిపించాడు. ఆ వ్యక్తిని మైనర్‌గా పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పోలింగ్ బూత్ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహులు గాంధీ స్పందించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని లూటీ చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కోరారు.