ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల కళాశాల నుండి గత మూడు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ నందు అనేక రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించింది. అలాగే మేము నిర్వహించే వివిధ రకాల కోర్సుల శిక్షణ ద్వారా మా విద్యార్థులు ఛార్టర్డ్ అకౌంటెంట్ మరియు లా సెట్ రంగాల్లో నైపుణ్యత సాధించడం కళాశాలలో సువిశాలమైన భవన సముదాయము, ఆకర్షణీయమైన క్లాస్ రూములు,మంచి నైపుణ్యత గల అధ్యాపకులు మరియు రుచికరమైన భోజన సదుపాయం(మెనూ) కలదు. అలాగే ఈ విద్యా సంవత్సరం 2024- 25 గాను కళాశాల నందు హెచ్ఈసి మరియు సీఈసీ కోర్సులలో చేరుటకు మైనారిటీ విద్యార్థినిల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. కావున వివిధ గ్రామాల నుండి ఆసక్తిగల మైనారిటీ విద్యార్థులు ధర్మపురి లో గల గురుకుల మైనారిటీ బాలికల కళాశాల నందు దరఖాస్తు చేసుకోగలరు. కావున ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగ పరచుకోగలరని కళాశాల ప్రిన్సిపల్ సంజీదా భాను గారు తెలియజేయడం జరిగింది.. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 90630 59241 మరియు 95057 28273. ప్రవేశాల చివరి తేదీ 30-6-2024