హైదరాబాద్, ఇదేనిజం : మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవలు అందించే క్రమంలో కరోనా బారినపడి మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉద్యోగులకు సూచించారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని, ధీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను శాఖాపరంగా ఆదుకునే అంశాలను పరిశీలించాలని మార్కెటింగ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి. కరోనా మూలంగా మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి మార్కెట్ డీఈఓ ముజాహిద్, ఏఎన్ సీ హైదరాబాద్ అటెండర్ కాంతల మృతిపట్ల సంతాపం ప్రకటించారు మంత్రి, వారి కుటుంభాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.