హిందీతో పాటు తెలుగులోనూ విశేష ఆదరణ పొందిన వెబ్ సిరీస్ చిత్రం మీర్జాపూర్. మాఫియా, క్రైం, ఫ్యామిలీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మొదటి పార్ట్ చాలా మంచి హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని నటుల నటన, డైలాగులు అన్నీ నిజ జీవితంలోలా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇక సినిమాలో బూతులు కూడా ఎక్కువే. ఘాటైన డైలాగుతో సినిమాకు మరింత పాపులారిటీ వచ్చింది. ఇక సినిమాలో గుడ్డూ, బబ్లూ, మున్నా క్యారెక్టర్లు ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు చిత్ర దర్శకులు. ఇక తనకు ఎక్కడ పోటీకి వస్తారో అని మున్నా గుడ్డూ, బబ్లూలపై హత్యా ప్రయత్నం చేస్తాడు. ఈ దాడిలో బబ్లూతో పాటు గుడ్డూ భార్య చనిపోతుంది. తీవ్ర గాయాలతో గుడ్డూ తప్పించుకోవడంతో మొదటి సీజన్ పూర్తవుతుంది. ఇక గుడ్డూ తన పగను ఎలా తీర్చుకుంటాడు అన్నదే రెండవ భాగంలో చూపబోతున్నారు. అయితే ఈ సీజన్ 2 కు సంబందించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.