Homeసినిమామీర్జాపూర్–3 Streaming ఎప్పుడంటే..!

మీర్జాపూర్–3 Streaming ఎప్పుడంటే..!

ప్రస్తుతం ఓటీటీలో వెబ్​ సిరీస్​ల ట్రెండ్ నడుస్తోంది. నెట్​ఫ్లిక్స్, అమెజాన్​, హాట్ స్టార్, జీ, సోని లివ్ ఇలా అన్ని ఓటీటీ యాప్​లు వెబ్​ సిరీస్​లపై ఫోకస్ చేశాయి. నెట్​ఫ్లిక్స్​లో ఇంటర్నేషనల్ కంటెంట్​తో వచ్చే వెబ్​సిరీస్​లకు వరల్డ్​ వైడ్​గా ఫ్యాన్స్​ ఉన్నారు. అమెజాన్​లో ఇంటర్నేషనల్ కంటెంట్​తో పాటు ఇండియన్​ కంటెంట్​ వెబ్​ సిరీస్​లు చాలానే వచ్చాయి. అలాంటి వాటిలో ఓటీటీ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. క్రైమ్‌ అండ్ పొలిటికల్ థ్రిల్లర్​గా 2018లో వచ్చిన మీర్జాపూర్​ ఫస్ట్​ సీజన్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ను కరణ్‌ అన్షుమన్‌ మరియు గుర్మీత్‌ సింగ్‌లు తెరకెక్కించారు. 2020లో వచ్చిన మీర్జాపూర్–2 సైతం రికార్డ్​ స్థాయిలో వ్యూవర్ షిప్ సాధించింది. దీంతో ఓటీటీలో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్​గా మీర్జాపూర్ నిలిచింది. అయితే, ప్రస్తుతం మీర్జాపూర్–3 సీజన్ కూడా రిలీజ్​కు సిద్ధమైంది. దీని కోసం ఓటీటీ ఆడియెన్స్​ ఎంతో ఇంట్రెస్ట్​గా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి క్రేజీ అప్​డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. మీర్జాపూర్‌ సీజన్ 3 వచ్చే నెల క్రిస్మస్ రోజున లేదా న్యూఇయర్ రోజున స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్​ సర్కిల్​లో ఈ బజ్​ బాగా వైరల్ అవుతోంది. అయితే, ప్రైమ్ వీడియో నుంచి ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.

Recent

- Advertisment -spot_img