ఇదే నిజం, వరంగల్ తూర్పు ప్రతినిధి: వరంగల్ నగరంలోని సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేశ్ తెలిపారు. భూపాల్ పల్లి జిల్లాకు చెందిన విద్యార్థిని వరంగల్ నగరంలోని కేయూ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి పోయినట్లు సీసీ కెమెరాల పూటేజీ ద్వారా పోలీసులు నిర్ధారించారు.