Homeజాతీయం8 నెలలకు దొరికిన ఆర్మీ జవాను మృతదేహం

8 నెలలకు దొరికిన ఆర్మీ జవాను మృతదేహం

జనవరిలో తప్పిపోయిన భారత ఆర్మీ జవాన్ మృతదేహం శనివారం కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో కనుగొనబడింది. హవల్దర్ రాజేంద్ర సింగ్ నేగి (36) కుటుంబానికి ఆయన తప్పిపోయిన రాత్రి సమాచారం ఇచ్చారు అధికారులు.

భారతీయ సైన్యంలోని 11 గర్హ్వాల్ రైఫిల్స్‌కు అనుబంధంగా ఉన్న నేగి, ఈ ఏడాది జనవరిలో కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖకు సమీపంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భారీ మంచులో పడిపోవడంతో తప్పిపోయాడు.

ఆ సమయంలో అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమైన సైన్యం జూన్‌లో అతన్ని ‘అమరవీరుడు’ గా ప్రకటించి, జూన్ 21 న ఒక లేఖలో అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే, అతని భార్య రాజేశ్వరి దేవి అతన్ని అమరవీరుడిగా అంగీకరించడానికి నిరాకరించింది. ఆమె “తన భర్త శరీరాన్ని తన కళ్ళతో చూసేవరకు” అంగీకరించనని తెలిపింది.

2001 లో సైన్యంలో చేరిన నేగి డెహ్రాడూన్ నుండి 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న చమోలి జిల్లాకు చెందినవాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని తల్లిదండ్రులు చమోలిలోని వారి గ్రామంలో నివసిస్తుండగా అతను తన కుటుంబంతో మూడేళ్ల క్రితం డెహ్రాడూన్‌కు వెళ్లాడు. అతని తల్లిదండ్రులు సోమవారం నాటికి డెహ్రాడూన్‌కు చేరుకుంటారు. అధికారులు అధికారిక లాంచ మర్యాదలతో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img