Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని మిస్సింగ్‌.. అసలేం జరిగిందంటే?

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని మిస్సింగ్‌.. అసలేం జరిగిందంటే?

అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల అనే యువతి అదృశ్యమైంది. మే 28వ తేదీ నుంచి కన్పించకుండా పోయింది. గత వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.
అయితే కందుల నితీషా (23) మే 28 నుంచి కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఆమె కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. నితీషా అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కందుల నితీషా కనిపించకుండా పోయింది. ఆమె దొరికితే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ట్విట్టర్‌లో ఓ ప్రకటనను పంచుకున్నారు.

Recent

- Advertisment -spot_img