Homeజిల్లా వార్తలుమిషన్ పరివర్తన్ అవగాహన కార్యక్రమం

మిషన్ పరివర్తన్ అవగాహన కార్యక్రమం

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం డిండి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బుధవారండిండి పోలీసు వారి ఆధ్వర్యంలో గంజాయి మాదకద్రవ్యాల నిషిద్ధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ మరియు సబ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఒక్కసారి వీటికి బానిస అయితే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నారు. ఒక్కసారి గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే ఆరు నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటుందని అన్నారు. ఒకసారి గంజా సేవించి పట్టుబడితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని అన్నారు. గంజాయి ఎవరైనా తీసుకుంటున్న సమాచారం తెలిసిన, క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారం పోలీస్ వారికి 100 నెంబర్ కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పైన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు బ్యాంకు ఖాతా విషయములో సరైన విషయ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ సురేష్,ఎస్సై రాజు, కానిస్టేబుల్ కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, హోంగార్డులు చందు, కాసిం, మరియు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img