ఇదేనిజం, శేరిలింగంపల్లి: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్,గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ ,
భారతి నగర్(పార్ట్) డివిజన్లకు సంబంధించి కల్యాణ లక్ష్మి ,షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 520 మంది లబ్ధిదారులకు రూ.5కోట్ల 20 లక్షల 60 వేల 320 ఆర్థిక సహాయాన్ని మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ ,మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి చెక్కుల రూపేణా అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ .. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దిలీప్, ఆర్ ఐ రాంబాబు ,మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.