Homeహైదరాబాద్latest Newsసీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఇదే నిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గం పాపిరెడ్డి నగర్ కాలనీ కి చెందిన రజిత అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా మంజూరైన రూ . 2లక్షల 30 వేల  ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి  నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఉండి, భరోసా గా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాశినాథ్ యాదవ్ ,అశోక్  తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img