ఇదే నిజం, ఖానాపురం: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాకాల చెరువు కింద ఉన్న తుంగబంధం, సంగెమ్ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. సోమవారం ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పాకాల చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో తుంగబంధం, సంగెం కాల్వాలను తాత్కాలిక మరమ్మతుల కింద శుభ్రం చేశామని చెప్పారు. దీని ఆయకట్టు ద్వారా నీటిని అందించేందుకు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అవసరమైతే పూర్తిస్థాయిలో ఆయకట్టు కింద నీటిని విడుదల చేస్తామని చెప్పారు.