ఇదే నిజం, మంచిర్యాల : దండేపల్లి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయనికి ఎమ్మెల్యే విరాళం అందించారు. మ్యాదరిపేట గ్రామపంచాయతీ పరిధిలోని మాదాపూర్ గ్రామానికి చెందిన రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మండేలయ్య దేవుని విగ్రహ ప్రతిష్ట కోసం ఆయన రూ. 50,000/- ఆర్థిక సాయం అందించారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఆనందంగా జీవించాలని ఆయన వ్యాఖ్యానించారు. దేవాలయ నిర్మాణంతో ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందుతుందని వ్యాఖ్యానించారు.