Homeజిల్లా వార్తలుమంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

ఇదేనిజం, హైదరాబాద్‌ : రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పొన్నంతో తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్‌ ఎంతో చురగ్గా పని చేశారన్నారు. అలాగే జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వారి సహకారం ఉండాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. అందుకు మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారని సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img