Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే నా.. వీధి రౌడీ నా? నోటికొచ్చినట్టు వాగిన షాద్ నగర్ ఎమ్మెల్యే..!

ఎమ్మెల్యే నా.. వీధి రౌడీ నా? నోటికొచ్చినట్టు వాగిన షాద్ నగర్ ఎమ్మెల్యే..!

ఓ ప్రజాప్రతినిధిని అన్న ఇంగితం వదిలేసి, వీధిరౌడీలా ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్టు అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య. అసలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడనంతటి బజారు భాషతో బరితెగించిపోయాడు. వెలమ సామాజివర్గంపై ఆయన చేసిన నీచమైన కామెంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెలమ సామాజివర్గం మొత్తం కలత చెందుతోంది. ఎన్నో త్యాగాల చరిత్ర వెలమలది. గతంలో ఒక సామాజిక వర్గం గురించి ఎవరూ ఇంత దారుణంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఓ ఎమ్మెల్యే అందులో అధికార పార్టీ లో ఉండి ఇంత నిర్లజ్జగా, పబ్లిక్ గా సిగ్గు ఎగ్గూ లేకుండా తూలనాడడం సభ్యసమాజం జీర్ణించు కోలేకపోతున్నది.

రాజకీయాల్లో పార్టీల సిద్ధాంతాలు.. వాదనలు వేరు గావచ్చు. వ్యక్తుల మీద కోపం ఉంటే ఆ వ్యక్తులను విమర్శించవచ్చు. కానీ సామాజిక వర్గాన్ని దూషించడం.. ఇంగితజ్ఞానం ఉన్న వారెవరు హర్షించరు. కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం ఎనిమిది మంది వెలమ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మరి ఈ నికృష్ణ నీచ ప్రవర్తన గల షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ఇప్పుడు వెలమ మంత్రి తో పాటు వెలమ ఎమ్మెల్యేలందరినీ చంపుతాడా కొడతాడా? వాళ్లంతా ‘నా కొడుకు లేనా!’ జవాబు చెప్పాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అపఖ్యాతి..! ఎన్నో పార్టీలు మారి మారి చివరికి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయిన ఈ శంకరయ్య ను ఇలా రోడ్ల మీదకు వదిలిన అపఖ్యాతి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మూట కట్టుకుంటున్నది. అడ్డు అదుపు లేకుండా బలుపు మాటలు బాధ్యతగల ఎమ్మెల్యేనే మాట్లాడితే ఇక ప్రజాస్వామ్య విలువ ఏముంటుంది. ? కాంగ్రెస్ పార్టీ ఈ కళంకితుడి వల్ల ప్రజల్లో అభాసు పాలు అవుతుంది. ఇటువంటి కుక్క మూతి పిందెలను తక్షణమే కాంగ్రెస్ పార్టీ బయటికి సాగనంపకుంటే రాబోయే కాలంలో ఆ పార్టీకే పెద్ద నష్టం. ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ శంకర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అన్ని జిల్లాల్లో నిరసనలకు పిలుపు ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img