Homeజిల్లా వార్తలుసాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

ఇదే నిజం, దేవరకొండ: చింతపల్లి మండలంలోని స్థానిక సాయిబాబా ఆలయం లో గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకొని, వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అనంతరం సాయి బాబా అయలం కొరకై విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ట్రాన్స్ ఫార్మర్ ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు యస్ సి,ఎడి, మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం, చింతపల్లి మండల మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి,దేవాలయ కమిటీ చైర్మన్ ధనంజయ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, యువజన విభాగం నాయకులు వి వి ఆర్, సాయి రాథోడ్, మాకట్ లాల్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img