ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ మండలంలోని మంగలోనిబాయి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి పండుగన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శ్రీ లింగమంతుల స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేbక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ జాని యాదవ్, ఉమా మహేశ్వర్లు, జులూరి గిరి తదితరులు పాల్గొన్నారు.