Homeహైదరాబాద్latest Newsముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇదే నిజం, దేవరకొండ: బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని సోమవారం రోజున చింతపల్లి మండల కేంద్రంలో ఈద్గా వద్ద ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వార్థం అసూయ, రాగద్వేషాలలో విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరాతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అన్ని గుణాల కన్నా దాణగునమే ఉత్తమమైనది బక్రీద్ ముఖ్య సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భవాని పవన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి, చింతపల్లి మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img