ఇదే నిజం దేవరకొండ: చింతపల్లిమండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ అసోసియేషన్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించి, ప్రెస్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రెస్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొండూరి భవాని పవన్ కుమార్,సంజీవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరజ్ ఖాన్, వైస్ఎంపీపీ యాది గౌడ్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, అంగరేకుల గోవర్ధన్, ఎరుకల వెంకటయ్య గౌడ్, కొండల్,శ్రీనివాస్ రెడ్డి,మాజి జెడ్పిటిసి లు హరి నాయక్, రవి నాయక్, ప్రజా ప్రతినిధుల,నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.