ఇదే నిజం దేవరకొండ: చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామంలో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొక్కలు నాటకపోవడం, ఉన్న మొక్కలను నరికేస్తుండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుదన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అతి, అనావృష్టి వాతావరణ పరిస్థితులు సంభవిస్తున్నాయన్నారు. ఉత్తర భారతదేశంలో అతివృష్టి, మన దగ్గర వర్షాలు లేకపోవడానికి వాతావరణ సమతుల్యతో కారణమన్నారు. మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల దోమలు ప్రబలి చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయన్నారు. స్వచ్ఛాదనం పచ్చదనం కేవలం ఐదు రోజులు కార్యక్రమం కాదని ఇది నిరంతరంగా ప్రజలు కొనసాగించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా పచ్చగా ఉండేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇళ్లల్లో ఎక్కువగా పండ్లు పూల మొక్కలు నాటాలన్నారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగిరేకుల నాగభూషణ్ మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, సినియర్ నాయకులు సంజీవరెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి,మాజి మండల పార్టీ అధ్యక్షులు శ్రీను,గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్,యువజన కాంగ్రెస్ కిరణ్, మాజి సర్పంచ్ గోవర్ధన్, ఆర్డీవో శ్రీరాములు,ఎంపిడిఓ సుజాత, తహశీల్దార్ విజయ్ కుమార్, మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.