Homeహైదరాబాద్latest Newsగంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇదే నిజం దేవరకొండ: నేరేడుగొమ్ము మండలంలోని పెద్ద మునిగల్ గ్రామంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ సహిత అంకాలమ్మ జాతర మరియు గంగా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,శ్రీ లక్ష్మీ చెన్నకేశవ సహిత అంకాలమ్మ జాతర మరియు గంగా హారతి కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని,వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అనంతరం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
ఈ సందర్బంగా వారు ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ ప్రాంత ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మండల పార్టీ అధ్యక్షులు లొకసాని కృష్ణయ్య,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ బాలు నాయక్, సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి, నాయిని మాధవ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్,మాజి ఎంపీపీ గోవింద్,యువజన విభాగ నాయకులు హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ బుచ్చి లచ్ఛీరాం నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img