ఇదేనిజం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం నేరేడుగొమ్ము మండలంలో సోమవారం నాడు స్థానిక ఎంపీపీ దిక్కు నాయక అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే నేను బాలునాయక్ హాజరు కావడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతోపాటు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు పలువురు ఎంపిటిసిలు తమ మండలంలో ఉన్నటువంటి సమస్యల పై ప్రశ్నించగా వాటికి అధికారులు తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.
వ్యవసాయ రంగంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు, ఫారెస్ట్ అధికారులు అడగే ఆధారంగా జీవించే స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈదురుగాలిల వల్ల కరెంటు తీగలపై చెట్లను పడకుండా ముందస్తుగానే చెట్లను తొలగించాలని అధికారులకు సూచించారు. మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వైస్ ఎంపీపీ ఎంపీపీ ప్రజాప్రతినిధులు పలువురు ఎంపీటీసీలు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు