ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఏడవ వార్డు లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని,పిల్లలకు పాఠ్య పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగ్ లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని, అందులో భాగంగా పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజే చరిత్రలో నిలిచి పోయే విధంగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులు అందజేయడమే అందుకు నిదర్శనం అని అన్నారు. అదేవిదంగా తల్లిదండ్రులందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.