ఇదేనిజం, నారాయణఖేడ్: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకు 25 కొత్త బస్సులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు హైదరాబాద్ లోని మినిస్టర్స్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు.కొత్త బస్సులు కేటాయించెందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.