Homeహైదరాబాద్latest Newsకబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలి.. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలి.. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఆదివారం హన్మకొండ జిల్లాలో పర్యటించారు. కేటీఆర్ హన్మకొండ జిల్లాలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలోనే కూర్చుని కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం జనాభా సర్వే నివేదిక ఏమైందని కేటీఆర్‌ను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే స్వేచ్ఛను హరించిందన్నారని నిలదీశాడు. బీఆర్ఎస్ పథకాలన్నీ దోపిడీ కోసమే తీసుకొచ్చారని దుయ్యబట్టారు. మీరు పదేళ్లలో చేయలేని పనులను మేము చేస్తున్నామని పేర్కొన్నారు. అసలే కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img