ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం అసెంబ్లీలో శుక్రవారం ధరణి స్థానంలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టే సమయంలో, ఉద్దేశ్య పూర్వకంగానే సభను తప్పు దారి పట్టించే విధంగా..ఫార్ములా – ఈ కార్ రేసులో జరిగిన అక్రమాల పట్ల కేటీఆర్ మీద ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అంశం గురించి చర్చ పెట్టాలని హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగుతూ..దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని అవమానప రిచేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మీద పేపర్లు విసురుతూ, వెల్ లోకి దూసుకెళ్లి దాడికి యత్నించిన తీరు పట్ల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. దళితుడు స్పీకర్ గా ఉన్నందుకే మాజీ సీఎం,ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని అన్నారు.పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ ప్రధాత బాబా సాహెబ్ అంబేద్కర్ అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దళిత స్పీకర్ మీద దాడికి యత్నించారని విచారం వ్యక్తం చేశారు..తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా అభివ ర్ణించారు..శాసనసభ సమావేశాలు జరుగుతు న్నప్పుడు సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దు , నినాదాలు చేయొద్దు, వెల్ లోకి రావొద్దని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చిందని..ఈ నిబంధనలతోనే గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంపత్ సస్పెండ్ చేశారని తెలిపారు..ఇవే నిబంధనలు అమలు చేస్తూ స్పీకర్ ని అవమాన పరుస్తూ,సభ నియమాలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..