జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆర్టికల్ 370 రద్దుపై సభలో చర్చ జరిగింది. ఇది కాస్త బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణకు దారితీసింది. బీజేపీ, ఎన్సీ సభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సభ్యులు పేపర్లను చించి స్పీకర్ పై విసిరేశారు. బీజేపీ, ఎన్సీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. అసెంబ్లీ రణరంగంలా మారడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.