ఇదే నిజం, తిమ్మాపూర్: మార్నింగ్ వాక్ లో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి, నర్సింగపూర్ గ్రామాల్లో ఎంపీటీసీ సభ్యుడు బండారి రమేష్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపెల్లి రమణారెడ్డి, పోరండ్ల ఎంపీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ బుడిగె కొండయ్య, పోలు రాము రమేష్, ఆశిక్ పాషా, గ్రామశాఖ అధ్యక్షులు గుంటి మల్లేశం, చిరుతల యాదగిరి, సీనియర్ నాయకులు కనుకo కొమురయ్య, మెరుగు మోహన్, బుడిగె సంపత్, మనోజ్, అజయ్, దొబ్బల శేఖర్, కనకం అనిల్, సిగ్గుళ్ల నరేష్, వెంగల వెల్లేష్, గుంటి బీరయ్య తదితరులు ఆయన వెంట ఉన్నారు.