ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరుసగా మూడో రోజు కోడే పందాలు జోరుగా నడుస్తున్నాయి. భీమవరం, ఉండి, ఆకీవీడు, కాళ్ల, వీరవాసరం, లింగపాలెం, దెందులూరు.. పలు ప్రాంతాల్లో కోడి పందాలతో పాటు పేకాట, గుండాట జోరుగా ఆడుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు(mla), ఎంపీ(mp)లు కూడా పందాల్లో పాల్గొంటున్నారు. పలుచోట్ల కోడిపందాల్లో బులెట్ బైకు(bullet bikes)లు బహుమతిగా ఇస్తున్నారు. పందాల పేరుతో కోట్ల రూపాయిలు చేతులు మారుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కోడి పందాలు ముగియనున్నాయి.