Homeహైదరాబాద్latest Newsవరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడిన ఎమ్మెల్యేలు

వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడిన ఎమ్మెల్యేలు

ఇదే నిజం, దేవరకొండ: డిండి మండల పరిధిలోని గోనబోయినపల్లి గ్రామానికి చెందిన పలువురు చేపలు పట్టటానికి వెళ్లి సిద్దాపూర్ శివారులోని రాతి బండపై ఉంటున్న చిన్నపిల్లలతో సహా 10 మంది చెంచులు వరద మధ్యలో చిక్కుకున్న విషయం స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలుసుకొని వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాగులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు స్వయంగా రంగంలోకి దిగి, గజ ఈతగాళ్ల సహాయంతో వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేడు ఉదయం 7:00గంటలకు సిద్దాపురం సమీపంలోని డిండి వాగు వద్దకు చేరుకొని వరద బాధితులను నేరుగా కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.

  • భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు.
  • వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు అని అన్నారు.
  • అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు.
  • ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అన్నారు.
  • భారీ వర్షాలు,వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి,బాధితులను ఆదుకోవాలి అని అన్నారు.
  • గత మూడు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమై ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు.పేదలను ఆదుకోవడంలో ఎక్కడ రాజీ పడబోమని స్పష్టం చేశారు.
    ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, డిండి మాజీ సర్పంచ్ శైలేష్, గడ్డామిది సాయి, మేకల కాశన్న, బద్దెల శ్రీను, శ్రీనివాస్ గౌడ్, సాయి బాబా, ఖలీమ్, పోలీస్ శాఖ యంత్రాంగం, రెవెన్యూ శాఖ యంత్రాంగం, అచ్చంపేట పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img