MLC Election: తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు.. కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా…? అన్నట్లుగా సాగుతోంది. బీఆర్ఎస్ తప్పుకోవడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. మతతత్వ రాజకీయాలంటూ కాంగ్రెస్ విమర్శిస్తుండగా.. మీ హామీలు ఏమయ్యాయంటూ బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. బీసీ నినాదంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం సాగించారు. వారి భవితవ్యం మార్చి 3న తేలనుంది.