MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పార్టీ తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తమ్‌రెడ్డిని ప్రకటించారు. అలాగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్,నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య నిలబెట్టారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి ప్రకటించారు.