MLC Elections : హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగాయి. పోలింగ్ ప్రక్రియలో 77.68% ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు అదే రోజు ప్రకటించబడతాయి.